Thursday, December 17, 2015

" నిర్భయ " బాల నేరస్తుడు విడుదల అవుతున్నాడు !

ఢిల్లీ కాంగ్రెస్ ప్రబుత్వాన్ని , యావత దేశాన్ని కదిలించిన నిర్భయ మానబంగం మరియు హత్య లో ప్రదాన నిందితుడు , బాల నేరస్తుడు డిసెంబర్ 20, 2015 న విడుదల అవుతున్నాడు. 2012 డిసెంబర్ 16 వ తేదీన డిల్లీ వీదుల్లో అత్యంత హేయమైన సంఘటన లో బాల నేరస్తుడకు విధించిన 3 సంవత్సరాల శిక్ష పూర్తి అవటంతో విడుదలకు సిద్దంగా ఉన్నాడు. 
దేశం లో ఇప్పుడు ప్రదాన చర్చ ఇంతటి పాశవిక సంఘటన లో ప్రదాన నిందుతుడు అయిన బాల నేరస్తుడు విడుదల అయితే సమాజం హరసిస్తుండా అనేది ప్రదాన సమస్య. చట్టం లోని లోసుగులతో దేశాన్ని అత్యంత ప్రబావితం చేసిన మహిళా మానబంగం - హత్య లాంటి సంఘటనలో బాల నేరస్తుడు అని విడుదల చెయ్యలా ? అదే కేసులో అతని సహచర నిందితులు యావజ్జీవ మరణ శిక్షని అనుబవిస్తున్నారు. 
ప్రస్తుత డిల్లీ ప్రబుత్వం బాల నేరస్తుడు విడుదల అయితే అతని పునరావాసం కోసం అప్పుడే చర్యలు మొదలెట్టింది. రూ 10 వేలు ఆర్ధిక సహాయం ,  ఒక కుట్టు మిషన్ మరియు ప్రబుత్వ షాపింగ్ సముదాయం లో ఒక గది తదితర సహం ఒక 6నెలలు అందించాలి అని నిర్ణయించుకుంది. బాల నేరస్తులకు పునరావాసం చాల అవసరం. ఇది ఇలా ఉంటే బాల నేరస్తుడు లో ఎలాంటి పచ్చతాపం లేనట్టు ఇటీవల ఒక పత్రిక తెలియచేసింది. అతను చాల తెలివిగా ప్రవర్తించి బాల నేరస్తుడు అనే కారణం తో బయటకు రావాలి అని ఉత్సాహ పడుతున్నాడు. 
అయితే బాల నేరస్తుడు అని ఇతనిని విడుదల చేస్తే సమాజం లో మన చట్టం , న్యాయ వ్యవస్తల మీద అత్యంత ప్రబావం చూపిస్తింది అని కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ఇప్పటికే చట్టం లో లొసుగులు అంటూ ఎందరో నేరస్తులు తప్పించుకుంటున్నారు అనే అపవాదు మన న్యాయవ్యవస్త మీద ఉంది. బాల నేరస్తులకు మన చట్టం లో కేవలం 3 సంవత్సరాలు శిక్ష మాత్రమె ఉంది, కాని మాన బంగం , హత్య యాసిడ్ దాడి లాంటి కేసులలో బాల నేరస్తులకు 6 - 18 వరకు శిక్ష అమలు చెయ్యాలి అని కొందరు మేధావులు అభిప్రాయ పడుతున్నారు. 

No comments:

Post a Comment