Sunday, December 11, 2011

స్వతంత్ర భారతం - సమాజం

ఈ మద్య సోషల్ నెట్వర్క్ లలో మన యువతి, యువకులు, కొంతమంది పెద్ద మనుషులు తరుచుగా ఒక్క ప్రశ్న అడుగుతున్నారు అరవై యేండ్ల స్వతంత్రం , మన పాలకులు ఈ దేశాన్ని ఏమి అభివృద్ధి చేసేరు అని రోజు వందల మెసేజెస్ మనం చదువుతూ ఉంటాం. అప్పుడు ,అప్పుడు నాకు అనిపిస్తుంది స్వతంత్ర భారతం మనకు ఏమి ఇచింది అని!! 
ప్రపంచ దేశాలకంటే మనదేశం మేధోపరంగా ఎంతో ఉన్నతమైన దేశం అయితే తరాలు మారేకొద్దీ మనదేశం లో సామజిక రుగ్మతలు ఇతర దేశాలకంటే ఎక్కువైపోయి శాస్త్ర, సాంకేతిక విషయాలను మరుగున పరిచేరు . ముక్యంగా 11 వ శతాబ్దం లో శైవులు, విష్ణువు ల మద్య మొదలై , ఘజిని, ఘోరి లాంటి విదేశి రాజులూ మన దేశం మీద దండయాత్ర చేసి భారతీయులను అస్తిరపరిచేరు, ఆతరువాత వచ్చిన మొఘలులు , ఆంగ్లేయులు మన సంపదను, విజ్ఞానాన్ని వాళ్ళ దేశాలకు , విలాసాలకు తరలించేరు. అయితే సిపాయుల తిరుగుబాటుతో మొదలైన మన ఆత్మగౌరవ పోరాటం ఈ రోజుకు చేస్తూనే ఉన్నాం. కొంతమంది తమ ఆధిపత్యం కోసం మతాన్నిఅడ్డంపెట్టుకుని  సమాజాన్ని చీలిచివేసారు. ఇక్కడ మనం వెనకబడటానికి మొదటి అడుగు అని చెప్పుకోవాలి. ఎంతో మంది మేధావులు ఈ రుగ్మతను రూపుమాపాలని చుసిన , చట్టాలు చేసిన ఈ రుగ్మత ఇంకా భారతీయ సమాజంలో ఉంది. 21 వ శతాబ్దం లో కూడా " పరువు" పేరిట  హత్యలు మనం రోజు చూస్తూనే ఉన్నాం. ఈ సమాజం మనది అనే భావన కాకుండా , నాది అనే స్వార్దపురిత ఆలోచనలు మనలను వెనకకు నెట్టివేయబడుతుంది.
మనది ప్రపంచ దేశాలకంటే అత్యంత మెరుగైన ,స్వేచ ప్రజాస్వామ్య దేశం . కాని ఈ ప్రజాస్వామ్యం లోనే మనకోసం మనం నిర్మించుకున్న రాజ్యాంగ మౌలిక సూత్రాలను, హక్కులను మనం స్వేచగా ఉల్లంగిస్తున్నాం.
 పాలకులను  ప్రశ్నించే సమాజం లేకపోయేసరికి భందుప్రీతి, దురాశ తో స్వేచగా ప్రజా ధనాన్ని దోచుకుంటున్నారు. ఎప్పుడు అయితే వ్యక్తుల గురించి ఈ ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుంటయో అప్పుడు మిగతా సమాజం వెనకకు నెట్టివేయ బడుతుంది. 
రత్నాలను రాసులుగా పోసి రాజ్యాలను పాలించిన అత్యంత ధనిక దేశం లో ఈ రోజు కనీసం తినటానికి పోరాటాలు చేస్తున్నారు, కొంతమంది మా భూమి, నీరు, గాలి పెట్టుబడుదారులకు దోచిపెడుతున్నారు అని తుపాకులు పట్టుకుని పోరాటాలు చేస్తున్నారు. న్యాయం కోసం తరతరులుగా న్యాస్తానాలు చుట్టూ తిరుగుతున్నారు.
"సమాజం లో ఆర్దిక అసమానతలు తొలగించకుండా ఏ దేశం అభివృద్ధి చెందలేదు" ఈ అసమానతలకు పాలకులు కారణమా! లేక మనం కూడా కారణమా !!. పాలకులు ప్రజలలో భాగస్వామ్యం , ఎప్పుడు అయితే ప్రజలు తమ భాద్యత మర్చి ప్రవర్తిస్తారో అప్పుడే సమజం వెనకబడుతుంది, సమాజం తో పాటు మనం కూడా వెనకబడతాం.
రాజ్యాంగం   మనకు కల్పించిన అత్యంత ముక్యమైన హక్కు "ఓటు హక్కు" ఎంతమంది మనలో , ఈ పాలకులను విమర్శించే వాళ్ళు తమ " ఓటు హక్కు " ను ఉపయోగించుకుంటున్నారు? ఎంతమంది తమ అవసరాలకోసం ఇతరుల హక్కులులను, ఉల్లంగించుకుండా తమ పని తాము చేసుకుంటున్నారు. ఎంతమంది అవినీతిని , భందుప్రీతికి లొంగకుండా పని చేస్తున్నారు?
ఇలా మనలను మనం ప్రస్నిచుకుంటూ పొతే 64  యేండ్ల స్వతంత్ర భారతావని అభివృద్దికి మనం ఏమి చేసేము, మనకు ఏమి ఇచింది అనేది మనకు అవగాహం అవుతుంది.
The highest measure of democracy is neither the 'extent of freedom' nor the 'extent of equality', but rather the highest measure of participation.
A. d. Benoist

And 
History calls those men the greatest who have ennobled themselves by working for the common good; experience acclaims as happiest the man who has made the greatest number of people happy.
 Karal  Marx  

" విప్లవం ఎక్కడనుండో పుట్టదు మనమద్యే పుడుతుంది , మనలోనే పుడుతుంది" 

Saturday, December 10, 2011

బావ స్వేచ !!

ఈ మద్య కొంత మంది వ్యక్తులు మన రాజకీయ నాయకులను, మన దేశాన్ని తిట్టడం fashion fashion అయిపొయింది. ప్రతిదానికి అమెరికాని ఉదాహరణ గా చూపించటం.., చాల మంది పెద్దమనుషుల పేరు తో అమెరికా ని నెత్తిమీద పెట్టుకుని తిరుగుతున్నారు. 
అసలకి మన దేశ సామాజక పరిస్తితి, ఆర్దిక మరియు రాజకీయ పరిస్తితి తెలుసుకోకుండా పాలకులను, రాజకీయ నాయకుల ను నిందించటం తగదు, దశాబ్దాలు ఒక వర్గాన్ని సమాజం నుండి దూరంగా ఉంచారు, వందల ఏండ్లు ఈ దేశాన్ని ఆంగ్లేయులు పాలించటం ఈ దేశ ప్రజలను భానిసలు గా  చూసారు. బహుశా ఆ భానిస మనస్తత్వం ఏమో అమెరికా , అమెరికా అని కలవరిస్తున్నారు. ఒక ప్రక్క స్వదేశి వ్యాపారాన్ని మరచి , చివరకు చిల్లర దుకాణాలను కూడా విదేశాలనుండి దిగుమతి చేసుకుంటుంటే ఈ దేశం ఎలా అభివృద్ధి జరుగుతుంది ? సమ సమాజాన్ని నిర్మించాలేనప్పుడు దేశాన్ని ఎలాగా నిర్మిస్తారు??
"చీకటి గా ఉంది అని చీకటిని తిట్టుకోకుండా ఒక్క దీపాన్ని వెలిగించామన్నారు" అలాగే మన నాయకులను తిట్టుకోకుండా ఈ దేశానికీ మనం ఏమి ఇస్తున్నాము అనేది ఆలోచిస్తే అప్పుడు తప్పకుండ ఈ దేశం అభివృద్ధి చెందుతుంది 

Three things cannot be long hidden

The Sun
The Moon
and
The truth 
____________________________________________________: BUDDA