Wednesday, December 16, 2015

కార్తీ ని ఇంకెంత కాలం వేదిస్తారో : కేంద్ర మాజీ మంత్రి చిదంబరం

చెన్నై : మాజీ కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి చిదంబరం కుమారుడి కి చెందినదిగా బావిస్తున్న చెస్ గ్లోబల్ అడ్వైజరీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ సమస్త మీద కేంద్ర ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED ) దాడులు నిర్వహించింది. విదేశీ మారక ద్రవ్య ఉల్లంగన కు పాల్పడ్డారు అంటూ ఈ సంస్త తో పాటు వాసన్ హెల్త్ కేర్ , అడ్వాంటేజ్ స్త్రాటాజీస్ కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కు చెందిన ఆఫీస్ ల మీద కూడా ఇ డి దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో ఇ డి ఒక లాప్ టాప్ ని స్వాదీనం చేసుకుంది. 

ఇదీలా ఉంటే ఈ సంస్త లకు తనకు ఎలాంటి సంబంధం లేదు అంటూ కార్తి చిదంబరం పక్కకు తప్పుకున్నాడు. పై మూడు సంస్తల మీద ED దాడులు జరిగినట్టు సమాచారం ఉంది అని అయితే వాటికీ నాకు ఎలాంటి సంబంధం లేదు అంటూ కార్తి పక్కకు తప్పుకున్నాడు. అవి నా స్నేహితులకు సంబందించిన సంస్తలు అని వాటి ప్రొఫైల్ చుస్తే అర్ధం అవుతుంది అని చెప్పేరు. 

అయితే అంతకు ముందు పి ,చిదంబరం మాట్లాడుతూ తన కుమారుడిని కేంద్రం ఇంకెంత కాలం వేదిస్తుందో చూస్తాను అని. కేంద్ర మూర్ఖపు చర్యలను గమనిస్తున్నాను అని , అయితే ED లో నిబద్దత గల అధికారులు ఉన్నారు అని వారు చట్టప్రకారమే పని చేస్తారు అని చిదంబరం పేర్కొన్నారు. 




No comments:

Post a Comment