Thursday, March 1, 2012

" పరువు "

అనగనగా...కాదు మనం ఇప్పుడు 21 వ శతాబ్దం లో ఉన్నాం అదీకాకుండా ప్రపంచం మొత్తం మన గుప్పెటలో పెట్టుకునే అత్యంత ఆధునీకరణ యుగం లో ఉన్నాం!. కొన్ని నిముషాలు ఈ యుగాన్ని పక్కన పెడదాం.
సహజంగానే నేటి మన అమ్మాయిలు మహేష్ బాబు లాంటి జీవిత భాగస్వామి కావాలి అని కళలు కంటూ ఉంటారు.  మరీ " మహేష్ బాబు " కాకపోయినా కొంచం దగ్గరగా ఉండాలి అని కోరుకుంటారు .అలాగే అబ్బాయిలు కుడా అంతే "మహేష్ బాబు లాగ ఉండాలి అనుకుంటారు.

మహేష్ బాబు అంటే పడి చచ్చే ఒక్క అమ్మాయి, మహేష్ బాబులా ఉండాలి అనుకునే అబ్బాయి ప్రేమలో పడతారు. సహజంగానే పెద్దలు ఒప్పుకోరు, ఎందుకంటె ఆస్తి అంతస్తులు  , చదువు కంటే  'కులం, మతం, గోత్రం  ముక్యం ..కారణం సమాజంలో "పరువు ". చివరకి మహేష్ బాబు తన చిన్ననాటి స్నేహితురాలు కొడుకు అని తెలుసుకున్నాక వాళ్ళ పెళ్ళికి పెద్దలు అంగీకరిస్తారు . ఇది ' అష్ట -చెమ్మ' సినిమాలో దర్శకుడు చెప్పిన కథ. అప్పుడు ప్రేక్షకులు కూడా హమ్మయ్య అని ఉపిరి వదిలి హాయిగా వెళ్తారు. అప్పటివరకు జనాలు కుడా చాల గంభీరంగా ఉంటారు. తర తరాలుగా మన మెదళ్ళలో ఉన్న భావం అది. అందుకే దర్శకుడు కనీసం సినిమాకి, ఊహకి  కూడా ఈ " పరువు " జాడ్యాన్ని వదులుకోలేకపోయాడు.

మన దేశం లో ఈ మద్య తరుచుగా పరువు పేరుతొ , కుల సంఘాలు , గ్రామ పెద్దలు తీర్పు ఇవ్వాటాలు, కుటుంభ సబ్యులే హత్య చేయటాలు. ప్రపంచాన్ని మన గుప్పెటలో పెట్టుకుంటున్న ఈ రోజులలో ఇంకా       " పరువు"  పేరుతొ హత్యలా ?   ఈ విభజన సంస్కృతే మన దేశానికి ప్రదాన శత్రువు 

పరువు హత్య మానవత్వానికి ఒక్క మచ్చ - మానవులు లాగ జీవిద్దాం.



                                              dreamSHOW

No comments:

Post a Comment