Sunday, November 14, 2010

IS CONGRESS PARTY PAPULARTY DICRESING IN AP




ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ తన ప్రాబల్యము కొల్పోతుందా

2004 ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ చరిత్ర లో ఒక్క సువర్ణ అధ్యాయము మొదలు ఆయీంది అనుకోవాలి. Dr . YS . రాజశేకర్ రెడ్డి ముక్య మంత్రి గా ప్రమాణం చేసిన మొదటి సెకండ్ నుంచి ఈ రాష్ట్రము లో ప్రజల నాడిని తెలుసుకొని పరిపాలించే ముఖ్యమంత్రి అయ్యాడు. ముక్యం గా పేద ప్రజలికి మన బాగోగులు పట్టించుకొనే నాయకుడు రాజశేకర్ రెడ్డి అని నమ్మకం కలిగించాడు. ప్రత్యేకవాదం వినిపించే నాయకులూ సైతం క్రమంగా రాజశేకర్ రెడ్డి ప్రజా పాలనకు ఆకర్షితులై ప్రత్యేకవాదం నుండి వైదొలగి కాంగ్రెస్ అనుబంద సబ్యులుగా అసెంబ్లీ లో రాజశేకర్ రెడ్డి పాలనకు మద్దతు తెలిపేరు.
కాంగ్రెస్ పార్టీ 2009 జనరల్ election లో తిరిగి రాష్ట్రము లో మరియు కేద్రము లో అధికారం లో కి రావటానికి రాజశేకర్ రెడ్డి పాలనా మనము ఒక్క ముక్య గట్టం గా చెప్పు కోవాలి, తిరిగి ముఖ్యమంత్రి అయీనతరువత రాజశేకర్ రెడ్డి అకాల మరణం తో రాష్ట్ర రాజకీయం లో అనూహ్య మార్పులు చేసుకున్నవి. రాజశేకర్ రెడ్డి వద్ద ఆర్ధిక మంత్రిగా చేసినటువంటి సీనియర్ నాయకుడు రోశయ్య ని ముక్య మంత్రి చేయటం, రాజశేకర్ రెడ్డి వర్గానికి, మరియు అభిమానులకు మింగుడుపడని విషయం. ఈ సమయము లో అప్పటి వరకు సైలెంట్ గా ఉన్న రాజశేకర్ రెడ్డి వెతిరేకులు, సినియర్స్ అని చెప్పుకునే వాళ్ళు కేంద్ర మంత్రి , మరియు  కాంగ్రెస్ ప్రధాన కమిటి లో సబ్యుడు , ప్రత్యెక వాదం వినిపించే నాయకుడు ఒక గ్రూపుగా మారి ముక్య మంత్రి రోశయ్య ని బలపరచటం, రాజశేకర్ రెడ్డి అభిమానులుగా చెప్పుకునే నాయకులను వెతిరేకించటం, మరియు ఓదార్పు యాత్ర చేస్తున్న రాజశేకర్ రెడ్డి కుమారుడు YS  జగన్ అధిష్టానానికి వెతిరేకము అని ప్రచారం కలిపించటం చాల తొందరగా చాపకింద నీరు మాదిరిగా చక చక గా జారిగిపోయాయీ. తెరాస నాయకుడు ఆమరణ నిరాహార  దీక్షలో కురచోటం రాష్ట్ర రాజకీయాని మరియు కేంద్రము లోని కాంగ్రెస్ ప్రబుత్వాన్ని ఉక్కిరి బిక్కిరి చేసింది. రోశయ్య ప్రబుత్వం అలసత్వం లో ప్రత్యేకవాదులు తమ రాజకీయ చతురంగాన్ని ప్రదర్శించి  రాష్ట్రము లోని అన్ని రాజకీయ పార్టీలని ప్రత్యెక రాష్ట్రము కోసం మేముసిద్దము అనిపించటము, డిసెంబర్ 9 , 2009  నాడు తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకు చిదంబరం చేత ప్రకటించతములో తమ రాజనీతిని  పండించారు. ఆతరువాత జరిగిన సంగటనలు మన అందరికి తెలిసిందే. కెసిఆర్  ఆడిన రాజకీయ చదరంగములో అన్ని రాజకీయపార్టీ లు పావులుగా మారిపోయారు. తెలుగుదేశం రెండు కళ్ళు సిద్దంతము మనకి తెలిసిందే. ముక్యంగా మను చేర్చించుకోవలిసిన విషయము రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ గురించి. కెసిఆర్ , మరియు తెలంగాణ కాంగ్రెస్ సినియర్స్ గా చెప్పుకునేవాళ్ళు, అధిష్టనములో రాజశేఖర్ రెడ్డి వెతిరేకులు తో కలిపి YS జగన్ ని ఒంటరిని చేయటము, ముక్యమంత్రిని బలపరుస్తూ రాష్ట్రాన్ని రెండుగా చీల్చటానికి ప్రయత్నిస్తున్నారు. ఈదేసమయములో ముఖ్యమంత్రి రోశయ్య YS జగన్ కి ప్రత్యన్యయంగా PRP నాయకుడు చిరంజీవిని తీసుకురావటం కాంగ్రెస్ అభిమానులుకు మింగుడుపడని విషయము, కాంగ్రెస్ ని గ్రామ, గ్రామ న బుజానికి ఎత్తుకున్న కాంగ్రెస్ కార్యకర్తలికి ఈ పరిణామాలు ఒక పెద్ద పజిల్. అసలికి ఎందుకు సోనియా గాంధీ తెరాస ని మరియు చిరంజీవి గురించి ఆలోచస్తుంది. రాష్ట్ర కాంగ్రెస్ లో పాపులర్ లీడర్ లేదని బాయమ , 2014 జెనరల్ ఎలెక్షన్ లో TDP ని ఓడించాలేము అని బయము ఉందా? అసలికి ఏంటి రాష్ట్ర కాంగ్రెస్ పరిస్తితి అని ప్రతి కార్యకర్తకి అర్ధముకాని విషయము. ఎందుకు కాంగ్రెస్ ఈ గందర గోళములో ఉంది. రాష్ట్ర కాంగ్రెస్ ఫై సోనియా కి తప్పుడు సంకేతాలు , సలహాలు ఇస్తున్నారు అని అనుకోవాలా?. రోశయ్య తన పదవి కాపాడుకోటానికి ఇలాంటి చరిత్రతప్పిడానికి నాయకులను పదవలు కోసము తప్పు దరి పట్టిస్తున్నడా? అనేది కార్యకర్తలు తమలో తామే అనుకుంటున్నా బేతాళ ప్రశ్న. YS రాజశేకర్ రెడ్డి ని ఇప్పుడు పార్టీ నాయకులే , పార్టీ వేదిక మీద నుండి విమర్స్తున్నారు , ఇది దేనికి సంకేతము. ఒక్క కాంగ్రెస్ నాయకుడు రాజశేకర్ రెడ్డి ముఖ్యమంత్రి గా తీసుకున్న అన్ని పదకాలమీద ఎంక్వయిరీ వేయమంటాడు. అంటే అది కాంగ్రెస్ వెతిరేకము కాదా, ప్రజలలోకి ఎలాంటి సంకేతాలు వెళ్తుంది. జలయజ్ఞం ధనయజ్ఞం అంటూ ప్రతిపక్షాల తో సమానముగా రాజశేకర్ రెడ్డి ని విమర్శిస్తే అది కాంగ్రెస్ పార్టీ ని విమర్శించ్నట్టు కాదా. ఎందుకు ఈ సంగటనల మీద చర్యలు తీసుకోవతము లేదు. కాంగ్రెస్ వేరు రాజశేకర్ రెడ్డి వేరునా ? కాంగ్రెస్ పార్టీ లోని నాయకులూ తమ వేళ్ళతో తమ కళ్ళని పొడుచు కుంటున్నారా 
 తెలంగాణా విడిపోతే అక్కడ కాంగ్రెస్ విజయకేతము వేస్తుంది అని మిగతా ప్రాంతాలలో కాంగ్రెస్ గురించి సీనియర్ నాయకులూ ఆలోచించటము లేదా. ఇదింతా సీనియర్  నాయకులూ పేరుతొ తెలంగాణా నాయకులూ పన్నిన కుట్రనా ఇందులో రోశయ్య కి కుడా బాగము ఉందా ?
 హైకమాండ్ కి విధేయత పేరుతొ పార్టీ లోని కొంతమది నాయకులను ప్రత్యెక వర్గము గా చూపిస్తూ పార్టీ ని గందర గోళములో పడవేసారు. సోనియా గాంధీ కి కావలిసింది విధేయతన లేక పార్టీ గెలుపున. పార్టీ లోని నాయకులకు క్రమశిక్షణ ముక్యమే కానీ విధేయత పేరుతొ ప్రాంతీయ వాదులకు, ఉప ప్రాంతీయ వాదులను ప్రోస్తాహిస్తూ కాంగ్రెస్ పార్టీ భావిష్యతులో జాతీయ  పార్టీ గా మనగకులుగుతుందా!. అధికార దాహము కోసము ఒక్క బలమైన నాయకుడు లేనప్పుడు మిగతా నాయకులూ ముఖ్యమంత్రి పీటము కోసము వేసే ఎత్తుగడే ఈ రాష్ట్ర కాంగ్రెస్ లో జరుగుతున్నా నాటకము. దాని పేరే విశ్వసనీయత , విధేయత .

No comments:

Post a Comment