ఆసుపత్రుల్లో ఐసీయు విభాగం పేరు వినగానే అలర్ట్ అవుతాం. తీవ్రమైన అనారోగ్య సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి అత్యంత జాగ్రత్తగా ఐసీయూలో చికిత్స చేస్తారన్న సంగతి అందరికీ తెలిసిందే. రోగుల కుటుంబ సభ్యుల్ని కూడా ఎప్పుడుబడితే అప్పుడు రానివ్వరు. బయటి వాతావరణం నుంచి వైరస్‌లు, బ్యాక్టీరియా రాకుండా నిరోధించేందుకుగాను నిర్ణీత సమయాల్లో గ్రీన్ యాప్రాన్‌తో మాత్రమే సందర్శకుల్ని రానిస్తారు. చిన్న అలికిడి లేకుండా లేకుండా చూసుకుంటూ కఠిన నిబంధనల మధ్య ఆసుపత్రుల ఐసీయూల్ని నిర్వహిస్తారు. కాగా, గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌లో ఉన్న సోలా సివిల్ హాస్పిటల్ వైద్యులు, నర్సులు, ఇతర విభాగాల సిబ్బంది, పనివారు ఈ నిబంధనలన్నిటినీ తుంగలోకి తొక్కేశారు. ఒంటి మీద ఏ డ్రెస్ ఉంటే ఆ డ్రెస్‌తోనే, చెప్పులు, షూలతో ఐసీయూలోకి ప్రవేశించి గర్బా ఆడుకున్నారు. పెద్ద శబ్దంతో మ్యూజిక్ పెట్టి ఈ విభాగంలోని రోగులకు నరకం చూపించారు.
Monday, December 14, 2015
Saturday, December 12, 2015
ఆంధ్ర రాజధాని లో కాల్ మనీ ఆగడాలు
కాల్ చేస్తే చాలు వాళ్లే ఇంటికి వస్తారు. ఎంత కావాలంటే అంత మనీ ఇస్తారు. ఇక డాక్యుమెంటేషన్ కూడా చాలా ఈజీ. ఎలాంటి షరతులు ఉండవు. కాకపోతే కాస్త వడ్డీ ఎక్కువ. అవసరం కదా అని డబ్బు తీసుకున్నారా చిక్కుల్లో పడ్డట్టే. సమయానికి వడ్డీ చెల్లించలేదో నరకం చూపిస్తారు. పీడించి, వేధించి మరీ వడ్డీలు వసూలు చేస్తారు. కట్టలేదంటే బౌన్సర్లతో దాడులు చేయిస్తారు. వారి కుటుంబంలోని స్త్రీలపై లైంగిక వేధింపులకు పాల్పడతారు. అత్యాచారాలు చేస్తారు. అదీ కాదంటే బలవంతంగా వ్యభిచారంలోకి దింపుతారు. ఇదీ కాల్ మనీ పేరుతో జరుగుతున్న ఘరానా మోసం. కాల్ మనీ పేరిట ఘరానా మోసాలు, లైంగిక వేధింపులకు పాల్పడుతున్న ముఠా సభ్యులను విజయవాడ టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు.
విజయవాడలో ఘరానా మోసం వెలుగు చూసింది. కాల్ మనీ పేరుతో వేధింపులకు గురి చేస్తున్న 12 మందిని టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. కృష్ణా జిల్లా పంటకాలువ రోడ్డులోని ఓ భవనాన్ని కేంద్రంగా తీసుకుని ముఠా సభ్యులు ఈ బాగోతాన్ని నడుపుతున్నారు. ప్రతి రోజు నగరంలో కోట్ల రూపాయలతో కాల్ మనీ వ్యాపారం చేయడంతో పాటు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు దాడులు నిర్వహించారు. కాల్ మనీ సభ్యులు రోజువారీ వడ్డీగా 10 నుంచి 25 రూపాయల వరకు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ముఠా అధిక వడ్డీ రేట్లకు అప్పులు ఇవ్వడమే కాకుండా బాధితులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తిచారు. అంతేకాదు బలవంతంగా మహిళలను వ్యభిచారంలోకి దింపుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. వేధింపులు ఎక్కువ కావడంతో కొందరు బాధితులు నగర పోలీసు కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. దీంతో వ్యవహారం వెలుగు చూసింది.
కాల్ మనీ ముఠా రోజుకు కోట్లలో టర్నోవర్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మోసంలో నగరంలోని బడా వ్యాపారవేత్తల పాత్ర కూడా ఉన్నట్లు సమాచారం. కోట్ల రూపాయలు విలువ చేసే డ్యాక్యుమెంట్లను సీజ్ చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు.. ముమ్మరంగా విచారణ జరుపుతున్నారు.
Wednesday, March 7, 2012
JAIHOO !... WOMEN !!
Before International women’s day Govt. of India has taken two important decisions to empower women and their welfare central Govt. directed by the advice of our president Smt. Pratiba patil instituted a national commission. And the other is central women and child welfare minister asked every state govt. women welfare minister should practice their respective states women’s empowerment.
THEME : CONNECTING GIRLS ...INSPIRING FUTURE
In article 14, 15, 16 constitution of India provides for equality between men and women. But in practice there is often denial of equality of women particularly in the rural areas due to feudalism and medievalism. In rural areas agriculture is based on physical labor. Men are physically stronger than women, and men were dominant in Feudalism and women largely confined house hold work. They were practically slaves of their husbands who often beat them cruelly. After marriage women passed their property to their husbands.
In our feudal society, she had to cook, wash clothes, clean the home and do other house hold chores, apart from bearing and rearing children. She was deprived of education and cultural.
After Industrialization women used to come out from the house hold activity. In industry brain is the more important than physical power, and much of the physical power is done by machines. So there is no need of physical labor. In modern society sophisticated Aircraft, mechanized weapons and computers which even women can operate. Hence in industry mental ability is more important than physical ability.
Intelligence quotient tests have established that the IQ of an average woman is the same as that of an average man. In fact if we give opportunity they can perform almost all activities. We have the set example of our great leader Smt. Indiara Gandhi, Elizabeth – 1 of England, Catherine the great of Russia.
In this century women try to develop economically independent. Even in our agriculture based rural areas also. She is earning like the same as man. Indian society is still male dominated, and women are often looked down upon. The birth of a female child is often regarded as disaster. And female foeticide is common in parts of India.
Our beloved former priminister Rajiv Gandhi try to empower women in India. He was started SHG (self help group) to develop urban and rural women economically independent. Economic independence is the first step towards women’s empowerment and empowerment leads to emancipation. This was the aim behind promoting women’s self-help groups in India. Today Andhra Pradesh state has the largest network of women self-help groups that number around 5 lakh with a membership of 1crore women. It was a small start but there are large scale awareness for example in Ongole town in Prakasham district, a group pf 15 women have purchased a farm tractor by securing a loan of four lakh rupees from the Municipal Corporation. This tractor is rented to private parties generating an income of Rs. 300 per day. The loan amount will be repaid by the group in installments.
The change is not just restricted to their physical well being. Women are now more confident, assertive and aware of their rights.
jaihoo! women !!
Happy women’s day______________________________ dreamSHOW
Thursday, March 1, 2012
" పరువు "
అనగనగా...కాదు మనం ఇప్పుడు 21 వ శతాబ్దం లో ఉన్నాం అదీకాకుండా ప్రపంచం మొత్తం మన గుప్పెటలో పెట్టుకునే అత్యంత ఆధునీకరణ యుగం లో ఉన్నాం!. కొన్ని నిముషాలు ఈ యుగాన్ని పక్కన పెడదాం.
సహజంగానే నేటి మన అమ్మాయిలు మహేష్ బాబు లాంటి జీవిత భాగస్వామి కావాలి అని కళలు కంటూ ఉంటారు. మరీ " మహేష్ బాబు " కాకపోయినా కొంచం దగ్గరగా ఉండాలి అని కోరుకుంటారు .అలాగే అబ్బాయిలు కుడా అంతే "మహేష్ బాబు లాగ ఉండాలి అనుకుంటారు.
మహేష్ బాబు అంటే పడి చచ్చే ఒక్క అమ్మాయి, మహేష్ బాబులా ఉండాలి అనుకునే అబ్బాయి ప్రేమలో పడతారు. సహజంగానే పెద్దలు ఒప్పుకోరు, ఎందుకంటె ఆస్తి అంతస్తులు , చదువు కంటే 'కులం, మతం, గోత్రం ముక్యం ..కారణం సమాజంలో "పరువు ". చివరకి మహేష్ బాబు తన చిన్ననాటి స్నేహితురాలు కొడుకు అని తెలుసుకున్నాక వాళ్ళ పెళ్ళికి పెద్దలు అంగీకరిస్తారు . ఇది ' అష్ట -చెమ్మ' సినిమాలో దర్శకుడు చెప్పిన కథ. అప్పుడు ప్రేక్షకులు కూడా హమ్మయ్య అని ఉపిరి వదిలి హాయిగా వెళ్తారు. అప్పటివరకు జనాలు కుడా చాల గంభీరంగా ఉంటారు. తర తరాలుగా మన మెదళ్ళలో ఉన్న భావం అది. అందుకే దర్శకుడు కనీసం సినిమాకి, ఊహకి కూడా ఈ " పరువు " జాడ్యాన్ని వదులుకోలేకపోయాడు.
మన దేశం లో ఈ మద్య తరుచుగా పరువు పేరుతొ , కుల సంఘాలు , గ్రామ పెద్దలు తీర్పు ఇవ్వాటాలు, కుటుంభ సబ్యులే హత్య చేయటాలు. ప్రపంచాన్ని మన గుప్పెటలో పెట్టుకుంటున్న ఈ రోజులలో ఇంకా " పరువు" పేరుతొ హత్యలా ? ఈ విభజన సంస్కృతే మన దేశానికి ప్రదాన శత్రువు
పరువు హత్య మానవత్వానికి ఒక్క మచ్చ - మానవులు లాగ జీవిద్దాం.
dreamSHOW
Sunday, December 11, 2011
స్వతంత్ర భారతం - సమాజం
ఈ మద్య సోషల్ నెట్వర్క్ లలో మన యువతి, యువకులు, కొంతమంది పెద్ద మనుషులు తరుచుగా ఒక్క ప్రశ్న అడుగుతున్నారు అరవై యేండ్ల స్వతంత్రం , మన పాలకులు ఈ దేశాన్ని ఏమి అభివృద్ధి చేసేరు అని రోజు వందల మెసేజెస్ మనం చదువుతూ ఉంటాం. అప్పుడు ,అప్పుడు నాకు అనిపిస్తుంది స్వతంత్ర భారతం మనకు ఏమి ఇచింది అని!!
ప్రపంచ దేశాలకంటే మనదేశం మేధోపరంగా ఎంతో ఉన్నతమైన దేశం అయితే తరాలు మారేకొద్దీ మనదేశం లో సామజిక రుగ్మతలు ఇతర దేశాలకంటే ఎక్కువైపోయి శాస్త్ర, సాంకేతిక విషయాలను మరుగున పరిచేరు . ముక్యంగా 11 వ శతాబ్దం లో శైవులు, విష్ణువు ల మద్య మొదలై , ఘజిని, ఘోరి లాంటి విదేశి రాజులూ మన దేశం మీద దండయాత్ర చేసి భారతీయులను అస్తిరపరిచేరు, ఆతరువాత వచ్చిన మొఘలులు , ఆంగ్లేయులు మన సంపదను, విజ్ఞానాన్ని వాళ్ళ దేశాలకు , విలాసాలకు తరలించేరు. అయితే సిపాయుల తిరుగుబాటుతో మొదలైన మన ఆత్మగౌరవ పోరాటం ఈ రోజుకు చేస్తూనే ఉన్నాం. కొంతమంది తమ ఆధిపత్యం కోసం మతాన్నిఅడ్డంపెట్టుకుని సమాజాన్ని చీలిచివేసారు. ఇక్కడ మనం వెనకబడటానికి మొదటి అడుగు అని చెప్పుకోవాలి. ఎంతో మంది మేధావులు ఈ రుగ్మతను రూపుమాపాలని చుసిన , చట్టాలు చేసిన ఈ రుగ్మత ఇంకా భారతీయ సమాజంలో ఉంది. 21 వ శతాబ్దం లో కూడా " పరువు" పేరిట హత్యలు మనం రోజు చూస్తూనే ఉన్నాం. ఈ సమాజం మనది అనే భావన కాకుండా , నాది అనే స్వార్దపురిత ఆలోచనలు మనలను వెనకకు నెట్టివేయబడుతుంది.
మనది ప్రపంచ దేశాలకంటే అత్యంత మెరుగైన ,స్వేచ ప్రజాస్వామ్య దేశం . కాని ఈ ప్రజాస్వామ్యం లోనే మనకోసం మనం నిర్మించుకున్న రాజ్యాంగ మౌలిక సూత్రాలను, హక్కులను మనం స్వేచగా ఉల్లంగిస్తున్నాం.
పాలకులను ప్రశ్నించే సమాజం లేకపోయేసరికి భందుప్రీతి, దురాశ తో స్వేచగా ప్రజా ధనాన్ని దోచుకుంటున్నారు. ఎప్పుడు అయితే వ్యక్తుల గురించి ఈ ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుంటయో అప్పుడు మిగతా సమాజం వెనకకు నెట్టివేయ బడుతుంది.
రత్నాలను రాసులుగా పోసి రాజ్యాలను పాలించిన అత్యంత ధనిక దేశం లో ఈ రోజు కనీసం తినటానికి పోరాటాలు చేస్తున్నారు, కొంతమంది మా భూమి, నీరు, గాలి పెట్టుబడుదారులకు దోచిపెడుతున్నారు అని తుపాకులు పట్టుకుని పోరాటాలు చేస్తున్నారు. న్యాయం కోసం తరతరులుగా న్యాస్తానాలు చుట్టూ తిరుగుతున్నారు.
"సమాజం లో ఆర్దిక అసమానతలు తొలగించకుండా ఏ దేశం అభివృద్ధి చెందలేదు" ఈ అసమానతలకు పాలకులు కారణమా! లేక మనం కూడా కారణమా !!. పాలకులు ప్రజలలో భాగస్వామ్యం , ఎప్పుడు అయితే ప్రజలు తమ భాద్యత మర్చి ప్రవర్తిస్తారో అప్పుడే సమజం వెనకబడుతుంది, సమాజం తో పాటు మనం కూడా వెనకబడతాం.
రాజ్యాంగం మనకు కల్పించిన అత్యంత ముక్యమైన హక్కు "ఓటు హక్కు" ఎంతమంది మనలో , ఈ పాలకులను విమర్శించే వాళ్ళు తమ " ఓటు హక్కు " ను ఉపయోగించుకుంటున్నారు? ఎంతమంది తమ అవసరాలకోసం ఇతరుల హక్కులులను, ఉల్లంగించుకుండా తమ పని తాము చేసుకుంటున్నారు. ఎంతమంది అవినీతిని , భందుప్రీతికి లొంగకుండా పని చేస్తున్నారు?
ఇలా మనలను మనం ప్రస్నిచుకుంటూ పొతే 64 యేండ్ల స్వతంత్ర భారతావని అభివృద్దికి మనం ఏమి చేసేము, మనకు ఏమి ఇచింది అనేది మనకు అవగాహం అవుతుంది.
The highest measure of democracy is neither the 'extent of freedom' nor the 'extent of equality', but rather the highest measure of participation.
A. d. Benoist
A. d. Benoist
And
History calls those men the greatest who have ennobled themselves by working for the common good; experience acclaims as happiest the man who has made the greatest number of people happy.
Karal Marx
Karal Marx
" విప్లవం ఎక్కడనుండో పుట్టదు మనమద్యే పుడుతుంది , మనలోనే పుడుతుంది"
Saturday, December 10, 2011
బావ స్వేచ !!
ఈ మద్య కొంత మంది వ్యక్తులు మన రాజకీయ నాయకులను, మన దేశాన్ని తిట్టడం fashion fashion అయిపొయింది. ప్రతిదానికి అమెరికాని ఉదాహరణ గా చూపించటం.., చాల మంది పెద్దమనుషుల పేరు తో అమెరికా ని నెత్తిమీద పెట్టుకుని తిరుగుతున్నారు. అసలకి మన దేశ సామాజక పరిస్తితి, ఆర్దిక మరియు రాజకీయ పరిస్తితి తెలుసుకోకుండా పాలకులను, రాజకీయ నాయకుల ను నిందించటం తగదు, దశాబ్దాలు ఒక వర్గాన్ని సమాజం నుండి దూరంగా ఉంచారు, వందల ఏండ్లు ఈ దేశాన్ని ఆంగ్లేయులు పాలించటం ఈ దేశ ప్రజలను భానిసలు గా చూసారు. బహుశా ఆ భానిస మనస్తత్వం ఏమో అమెరికా , అమెరికా అని కలవరిస్తున్నారు. ఒక ప్రక్క స్వదేశి వ్యాపారాన్ని మరచి , చివరకు చిల్లర దుకాణాలను కూడా విదేశాలనుండి దిగుమతి చేసుకుంటుంటే ఈ దేశం ఎలా అభివృద్ధి జరుగుతుంది ? సమ సమాజాన్ని నిర్మించాలేనప్పుడు దేశాన్ని ఎలాగా నిర్మిస్తారు??
"చీకటి గా ఉంది అని చీకటిని తిట్టుకోకుండా ఒక్క దీపాన్ని వెలిగించామన్నారు" అలాగే మన నాయకులను తిట్టుకోకుండా ఈ దేశానికీ మనం ఏమి ఇస్తున్నాము అనేది ఆలోచిస్తే అప్పుడు తప్పకుండ ఈ దేశం అభివృద్ధి చెందుతుంది
Three things cannot be long hidden
The Sun
The Moon
and
The truth
____________________________________________________: BUDDA
Sunday, November 27, 2011
విదేశి పెట్టుబడులు -భారత్ రిటైల్ మార్కెట్
'పాలకవర్గాలు తమ ప్రయోజనాలనే మొత్తం సమాజ ప్రయోజనాలుగాను , ఆదర్శవంతమైన రూపాలలో, విశ్వవ్యాప్త , హేతుభద్దమైన సిద్దంతాలుగాను, చెల్లుబాటు అయ్యే సిద్దంతలుగాను అమలు చేస్తాయని " కారల్ మార్క్స్ " హెచ్చరించాడు' ( 1845 )
ప్రస్తుతం మన అనుభవం కుడా ఇదే ఆర్ధిక వ్యవస్థ సరళీకరణ పేరుతొ విదేశి పెట్టుబడులు చిల్లర దుకాణాలలో కూడా ఆహ్వానించటం ఇది ఏ దేశ ప్రయోజనం కోసం , ఏ ప్రజల ప్రయోజనం కోసం. భారత దేశం వ్యవసాయ ఆదారిత మరియు గ్రామీణ నాగరికత మీద ఆదరిపడిన దేశం ఇలాంటి సమాజం లో లక్షల కుటుంబాలు చిల్లర దుకాణాల మీద ఆదారపడి జీవిస్తున్నాయి, అవే వారి జీవన ఆధారం . ఇప్పటికే పెద్ద పెద్ద నగరాలలో చైన్ మార్కెట్ పేరుతొ , మాల్స్ పేరుతొ మద్య తరగతి సూపర్ మార్కెట్ లను హరించి వేసాయి , రిటైల్ వ్యాపారస్తుల జీవితాలను రోడ్లు మీదకు తీసుకు వచ్చింది ఈ ప్రభుత్వాలు , మరల చిన్న చిన్న వ్యాపారాల లో కుడా పెట్టుబడుదారులు ప్రవేశిస్తే , భారత గ్రామీణ , నగరాల ఆర్దిక వ్యవస్థ విదేశి పెట్టుబడుదారుల మీద ఆదారపడి ఉంటుంది . అది ఎంత విద్వంసకరమో మనకు "ఈస్ట్ ఇండియా " కంపినీ తెలుసు , ప్రస్తుత స్టాక్ మార్కెట్ ల పరిస్తితి తెలుసు.
కేంద్రం లో కాని, రాష్ట్రము లో కాని ఏ భూర్జువ పార్టి అధికారం లో కి వచ్చిన సరళీకృత ఆర్ధిక విదానలే అమలు చేస్తున్నాయి వీటి పలితమే ఆశ్రిత పెట్టుబడి విదానం, అవినీతి, అధిక ధరలు తదితర సమస్యలన్నీ. దేశ ప్రయోజనాల ముసుగులో పాలక వర్గ సిద్దంతాలు, ప్రజల కనీస అవసరాలను పెట్టుబడులుగా చేస్తూ , పెట్టుబడిదారుల అభివృద్దే మొత్తం దేశ ప్రజల అభివృద్దిగా చూపిస్తున్నారు.
భారత దేశం లో అన్ని పార్టి లు , చివరకు కమ్యునిస్ట్ లు కూడా ఎన్నికల అనంతరం తమ విదానాన్ని మరచి ప్రభుత్వ ప్రజా వెతిరేక విదానాలను గుడ్డిగా మద్దతు ఇస్తున్నాయి. మన దేశం లో చిన్న తరహ , మద్య తరహా పారిశ్రామికరణ జరగకుండ ౩౦% విదేశి పెట్టుబడులను రిటైల్ రంగం లోకి ఆహ్వానించటం 'చైనా' లాంటి దేశాలకు ఉపయోగం తప్ప మన దేశనికి ఎలాంటి ప్రయోజనం లేదు. ప్రభుత్వం మన దేశ చిన్న ,మద్య తరహా వ్యాపారవేత్తల కాపాడటానికి బదులు , ప్రపంచం లోని మార్కెట్ లను కాపాడటానికే ఎక్కువ ఆసక్తిగా ఉన్నట్టుగా వుంది . ప్రభుత్వం చెప్పిన్నట్టు ఎన్ని తరహ ఆంక్షలు పెట్టిన మన గ్రామీణ ఆర్ధిక వ్యవస్థ కుప్పకూలటం ఖాయం. ఇప్పటికే అమెరికా 'చైనా' ఉత్పత్తులతో అతలాకుతలం అవుతుంది.
Subscribe to:
Posts (Atom)








