Monday, December 14, 2015

ఐసీయూలో గర్బా ఆడిన డాక్టర్లు, నర్సులు


ఆసుపత్రుల్లో ఐసీయు విభాగం పేరు వినగానే అలర్ట్ అవుతాం. తీవ్రమైన అనారోగ్య సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి అత్యంత జాగ్రత్తగా ఐసీయూలో చికిత్స చేస్తారన్న సంగతి అందరికీ తెలిసిందే. రోగుల కుటుంబ సభ్యుల్ని కూడా ఎప్పుడుబడితే అప్పుడు రానివ్వరు. బయటి వాతావరణం నుంచి వైరస్‌లు, బ్యాక్టీరియా రాకుండా నిరోధించేందుకుగాను నిర్ణీత సమయాల్లో గ్రీన్ యాప్రాన్‌తో మాత్రమే సందర్శకుల్ని రానిస్తారు. చిన్న అలికిడి లేకుండా లేకుండా చూసుకుంటూ కఠిన నిబంధనల మధ్య ఆసుపత్రుల ఐసీయూల్ని నిర్వహిస్తారు. కాగా, గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌లో ఉన్న సోలా సివిల్ హాస్పిటల్ వైద్యులు, నర్సులు, ఇతర విభాగాల సిబ్బంది, పనివారు ఈ నిబంధనలన్నిటినీ తుంగలోకి తొక్కేశారు. ఒంటి మీద ఏ డ్రెస్ ఉంటే ఆ డ్రెస్‌తోనే, చెప్పులు, షూలతో ఐసీయూలోకి ప్రవేశించి గర్బా ఆడుకున్నారు. పెద్ద శబ్దంతో మ్యూజిక్ పెట్టి ఈ విభాగంలోని రోగులకు నరకం చూపించారు.

No comments:

Post a Comment