Friday, December 25, 2015

తీవ్రవాదులు రేప్ ఇందుకు చేస్తారంట…! దారుణం, చదవండి.

మానవత్వం అనే పదం అక్కడ ఎప్పుడో చచ్చి పోయింటుంది. మనిషి అన్న పదం తీవ్రవాదులు చేస్తున్న అకృత్యాలు చూసి ఎక్కడో మౌనంగా రోదిస్తూ ఉంటుంది. రాక్షసులు ఎలా రేప్ చేస్తారో వివరిస్తూ “న్యూయార్క్ టైమ్స్” ఒక కథనాన్ని ప్రచురించింది. అందులో ఈ మానవమృగాలు, ఎలా రేప్ చేస్తారో, ఎందుకు చేస్తారో, వాళ్ళ ఆకృత్యాలను కొందరి బాధితులతోటి చెప్పించి కళ్ళకు కట్టే ప్రయత్నం చేశారు. అందులో కొన్నింటిని కనుక మనం పరిశిలించినట్లు అయితే…
” 12 సంవత్సరాల పాపను ఒక తీవ్రవాది రేప్ చెయ్యడం కంటే ముందు, ఆ బాలికకు వాడు చేసేది పాపం కాదని వివరిస్తాడట. ఎలా అంటే… ఆ బాధిత పాప, ఇస్లాంని కాకుండా వేరే మతాన్ని ఆచరించడం వలన, “కురాన్” వీడికి రేప్ చెయ్యమని చెప్పడంతో పాటుగా, వీడు చేస్తున్న దానిని క్షమించడంతో పాటు ఇంచెయ్యమని ప్రోత్సహిస్తుంది కురాన్, అని చెప్తాడట.
తరువాత వాడు ఆమె చేతులు కట్టేసే బెడ్ మీదకు తోస్తే ఆ బాలిక ఆపే ప్రయత్నం చేసిందట. తరువాత వాడు ఆ బాలిక ముందు సాష్టాంగ నమస్కారంగా ప్రార్థన చేసి, తరువాత రేప్ చేశాడంట. రేప్ అయిపోయిన తరువాత కూడా మళ్లీ సాష్టాంగ నమస్కారంగా ప్రార్థన చేసి “కురాన్” చెప్పినట్లే నేను చేశా అని చెప్తాడట.
వాడు రేప్ చేసే సమయంలో ఆ బాలిక శరీరం వాడికి సరిపోవాట్లేదట, ఆ సమయంలో బాధను భరించలేని ఆ బాలిక నాకు చాల బాధగా ఉంది, దయచేసి వదిలేయండి అని వేడుకుందట. కాని వాడు ” ఇస్లాం మతం ప్రకారం నీ లాంటి విశ్వాసం లేని వాళ్ళని అత్యాచారం చెయ్యడానికి నాకు అనుమతి ఇచ్చిందని చెప్పినాడట. అంతే కాకుండా వాడు అల రేప్ చెయ్యడం వలన అల్లాహ్ కి దగ్గరగా వెళతాను అని చెప్పినాడట. ” ఇలా 11 నెలలు నరకం అనుభవించి తప్పించుకున్న తరువాత ఆ బాలిక ఇంటర్వ్యూ ఇస్తుండగా, ఒక శరణార్థ శిబిరంలో తల దాచుకుంటున్న ఆమె కుటుంబం ఇంకో వైపు దీనంగా చూస్తూ ఉండి పోయిందని రాసింది.
ఇంకో వైపు తన 4 సంవత్సరాల తమ్ముడు దీనంగా చూస్తూ ఉండగా ఇంటర్వ్యూ కొనసాగించిన ఆ బాలిక, తీవ్రవాదులు తనను రేప్ చెయ్యడానికి వచ్చిన ప్రతిసారి ఇలానే ప్రార్థన చేసే వాళ్ళని, నన్ను వాళ్ళు అల్లాహ్ ముందు “ఎఫ్” అని మాత్రమే సంబోదించే వాళ్ళని, ” వాళ్ళు అల్లాహ్, మన ఇరాకీ సేవకుడు ఏడాది క్రితం అల్లాహ్ మీద విశ్వాసం లేని ఈ అమ్మయిన మాకు అప్ప చెప్పినాడని, మేము మీరు చెప్పినట్లే రేప్ చేస్తున్నామని చెప్పేవారని” చెమర్చిన కళ్ళతో ఆ బాలిక చెప్పడాన్ని వాళ్లు ప్రచురించారు.
తరువాత నేను వాళ్లకు చాల సార్లు మీరు చేస్తున్నది చాల తప్పు అని చెప్పే ప్రయత్నం చేశానని, కాని వారు, “మేము చేస్తున్నది “హలాల్”, కనుక ఇది కరెక్ట్ అని చెప్పేవారని ఆ బాలిక తెలిపింది.
అలాగే ఇంకో ఆవిడ అనుభవాన్ని కూడా “న్యూయార్క్ టైమ్స్ ” రాసుకొచ్చింది. 34 సంవత్సరాల ఒక స్త్రీని వారు రోజు ఏ విధంగా రేప్ చేసేది రాసుకొచ్చారు. ఆమె చెప్పిన ప్రకారం, నన్ను రోజులో చాల సార్లు రేప్ చేశారని, కాని ఒక 13 సంవత్సరాల బాలికను వారు రేప్ చెయ్యడం చూశాక నేనే కొంచెం నయమని భావించినట్లు ఆమె తెలిపింది.
” 13 సంవత్సరాల బాలికను రోజు రేప్ చేసేవారని, ఆ బాలికకు అధిక రక్తస్రావం అయినా కూడా వదిలే వారు కాదని ఆమె తెలిపింది. ఆ బాలిక శరీరం అలానే నాశనం అయ్యినాకూడా పట్టించుకోకుండా అలానే వదిలేసే వారని, వారు మళ్లీ వచ్చి ఎందుకు ఆ బాలిక అలా వాసన వస్తుందని అడిగే వారని ఆమె తెలిపింది. అప్పడు నేను వాళ్లకు చెప్పానని, ఆ బాలికకు ఇన్ఫెక్షన్ సోకింది, దయచేసి పాపను జాగ్రత్తగా చూసుకోండి, ఆ పాపను వదిలేయండి అని నేను బ్రతిమలానని చెప్పింది. “కాని దానికి వారు, ఆ బాలిక చిన్న అమ్మాయి కాదని, మాకు సేవ చెయ్యడానికి అల్లాహ్ పంపిన “బానిస” తను అని, అయినా తనకి సెక్స్ ఎలా చెయ్యాలో బాగా తెలుసంటూ అలానే వారు తమ అకృత్యాలు సాగించేవారని ఆమె వాపోయింది.
లాంటి ఎన్నో అనుభవాలతో “న్యూయార్క్ టైమ్స్ ” తన కథనాన్ని ప్రచురించింది.
అల్లాహ్ ను భక్తితో ప్రేమించే ఎవ్వరైనా, కురాన్ ను ఆరాధించే ఎవ్వరైనా… ఇలాంటి ఆకృత్యాలను సహించరని, కోట్ల మంది ప్రేమించే అల్లాహ్, ఖురాన్ పేరును ఇలాంటి దుర్మార్గులు వాడుకోవడాన్ని ఆపెస్తారని ఆశిద్దాం.

Thursday, December 17, 2015

" నిర్భయ " బాల నేరస్తుడు విడుదల అవుతున్నాడు !

ఢిల్లీ కాంగ్రెస్ ప్రబుత్వాన్ని , యావత దేశాన్ని కదిలించిన నిర్భయ మానబంగం మరియు హత్య లో ప్రదాన నిందితుడు , బాల నేరస్తుడు డిసెంబర్ 20, 2015 న విడుదల అవుతున్నాడు. 2012 డిసెంబర్ 16 వ తేదీన డిల్లీ వీదుల్లో అత్యంత హేయమైన సంఘటన లో బాల నేరస్తుడకు విధించిన 3 సంవత్సరాల శిక్ష పూర్తి అవటంతో విడుదలకు సిద్దంగా ఉన్నాడు. 
దేశం లో ఇప్పుడు ప్రదాన చర్చ ఇంతటి పాశవిక సంఘటన లో ప్రదాన నిందుతుడు అయిన బాల నేరస్తుడు విడుదల అయితే సమాజం హరసిస్తుండా అనేది ప్రదాన సమస్య. చట్టం లోని లోసుగులతో దేశాన్ని అత్యంత ప్రబావితం చేసిన మహిళా మానబంగం - హత్య లాంటి సంఘటనలో బాల నేరస్తుడు అని విడుదల చెయ్యలా ? అదే కేసులో అతని సహచర నిందితులు యావజ్జీవ మరణ శిక్షని అనుబవిస్తున్నారు. 
ప్రస్తుత డిల్లీ ప్రబుత్వం బాల నేరస్తుడు విడుదల అయితే అతని పునరావాసం కోసం అప్పుడే చర్యలు మొదలెట్టింది. రూ 10 వేలు ఆర్ధిక సహాయం ,  ఒక కుట్టు మిషన్ మరియు ప్రబుత్వ షాపింగ్ సముదాయం లో ఒక గది తదితర సహం ఒక 6నెలలు అందించాలి అని నిర్ణయించుకుంది. బాల నేరస్తులకు పునరావాసం చాల అవసరం. ఇది ఇలా ఉంటే బాల నేరస్తుడు లో ఎలాంటి పచ్చతాపం లేనట్టు ఇటీవల ఒక పత్రిక తెలియచేసింది. అతను చాల తెలివిగా ప్రవర్తించి బాల నేరస్తుడు అనే కారణం తో బయటకు రావాలి అని ఉత్సాహ పడుతున్నాడు. 
అయితే బాల నేరస్తుడు అని ఇతనిని విడుదల చేస్తే సమాజం లో మన చట్టం , న్యాయ వ్యవస్తల మీద అత్యంత ప్రబావం చూపిస్తింది అని కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ఇప్పటికే చట్టం లో లొసుగులు అంటూ ఎందరో నేరస్తులు తప్పించుకుంటున్నారు అనే అపవాదు మన న్యాయవ్యవస్త మీద ఉంది. బాల నేరస్తులకు మన చట్టం లో కేవలం 3 సంవత్సరాలు శిక్ష మాత్రమె ఉంది, కాని మాన బంగం , హత్య యాసిడ్ దాడి లాంటి కేసులలో బాల నేరస్తులకు 6 - 18 వరకు శిక్ష అమలు చెయ్యాలి అని కొందరు మేధావులు అభిప్రాయ పడుతున్నారు. 

Wednesday, December 16, 2015

కార్తీ ని ఇంకెంత కాలం వేదిస్తారో : కేంద్ర మాజీ మంత్రి చిదంబరం

చెన్నై : మాజీ కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి చిదంబరం కుమారుడి కి చెందినదిగా బావిస్తున్న చెస్ గ్లోబల్ అడ్వైజరీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ సమస్త మీద కేంద్ర ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED ) దాడులు నిర్వహించింది. విదేశీ మారక ద్రవ్య ఉల్లంగన కు పాల్పడ్డారు అంటూ ఈ సంస్త తో పాటు వాసన్ హెల్త్ కేర్ , అడ్వాంటేజ్ స్త్రాటాజీస్ కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కు చెందిన ఆఫీస్ ల మీద కూడా ఇ డి దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో ఇ డి ఒక లాప్ టాప్ ని స్వాదీనం చేసుకుంది. 

ఇదీలా ఉంటే ఈ సంస్త లకు తనకు ఎలాంటి సంబంధం లేదు అంటూ కార్తి చిదంబరం పక్కకు తప్పుకున్నాడు. పై మూడు సంస్తల మీద ED దాడులు జరిగినట్టు సమాచారం ఉంది అని అయితే వాటికీ నాకు ఎలాంటి సంబంధం లేదు అంటూ కార్తి పక్కకు తప్పుకున్నాడు. అవి నా స్నేహితులకు సంబందించిన సంస్తలు అని వాటి ప్రొఫైల్ చుస్తే అర్ధం అవుతుంది అని చెప్పేరు. 

అయితే అంతకు ముందు పి ,చిదంబరం మాట్లాడుతూ తన కుమారుడిని కేంద్రం ఇంకెంత కాలం వేదిస్తుందో చూస్తాను అని. కేంద్ర మూర్ఖపు చర్యలను గమనిస్తున్నాను అని , అయితే ED లో నిబద్దత గల అధికారులు ఉన్నారు అని వారు చట్టప్రకారమే పని చేస్తారు అని చిదంబరం పేర్కొన్నారు. 




Monday, December 14, 2015

ఐసీయూలో గర్బా ఆడిన డాక్టర్లు, నర్సులు


ఆసుపత్రుల్లో ఐసీయు విభాగం పేరు వినగానే అలర్ట్ అవుతాం. తీవ్రమైన అనారోగ్య సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి అత్యంత జాగ్రత్తగా ఐసీయూలో చికిత్స చేస్తారన్న సంగతి అందరికీ తెలిసిందే. రోగుల కుటుంబ సభ్యుల్ని కూడా ఎప్పుడుబడితే అప్పుడు రానివ్వరు. బయటి వాతావరణం నుంచి వైరస్‌లు, బ్యాక్టీరియా రాకుండా నిరోధించేందుకుగాను నిర్ణీత సమయాల్లో గ్రీన్ యాప్రాన్‌తో మాత్రమే సందర్శకుల్ని రానిస్తారు. చిన్న అలికిడి లేకుండా లేకుండా చూసుకుంటూ కఠిన నిబంధనల మధ్య ఆసుపత్రుల ఐసీయూల్ని నిర్వహిస్తారు. కాగా, గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌లో ఉన్న సోలా సివిల్ హాస్పిటల్ వైద్యులు, నర్సులు, ఇతర విభాగాల సిబ్బంది, పనివారు ఈ నిబంధనలన్నిటినీ తుంగలోకి తొక్కేశారు. ఒంటి మీద ఏ డ్రెస్ ఉంటే ఆ డ్రెస్‌తోనే, చెప్పులు, షూలతో ఐసీయూలోకి ప్రవేశించి గర్బా ఆడుకున్నారు. పెద్ద శబ్దంతో మ్యూజిక్ పెట్టి ఈ విభాగంలోని రోగులకు నరకం చూపించారు.

Saturday, December 12, 2015

ఆంధ్ర రాజధాని లో కాల్ మనీ ఆగడాలు



కాల్ చేస్తే చాలు వాళ్లే ఇంటికి వస్తారు. ఎంత కావాలంటే అంత మనీ ఇస్తారు. ఇక డాక్యుమెంటేషన్ కూడా చాలా ఈజీ. ఎలాంటి షరతులు ఉండవు. కాకపోతే కాస్త వడ్డీ ఎక్కువ. అవసరం కదా అని డబ్బు తీసుకున్నారా చిక్కుల్లో పడ్డట్టే. సమయానికి వడ్డీ చెల్లించలేదో నరకం చూపిస్తారు. పీడించి, వేధించి మరీ వడ్డీలు వసూలు చేస్తారు. కట్టలేదంటే బౌన్సర్లతో దాడులు చేయిస్తారు. వారి కుటుంబంలోని స్త్రీలపై లైంగిక వేధింపులకు పాల్పడతారు. అత్యాచారాలు చేస్తారు. అదీ కాదంటే బలవంతంగా వ్యభిచారంలోకి దింపుతారు. ఇదీ కాల్ మనీ పేరుతో జరుగుతున్న ఘరానా మోసం. కాల్ మనీ పేరిట ఘరానా మోసాలు, లైంగిక వేధింపులకు పాల్పడుతున్న ముఠా సభ్యులను విజయవాడ టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు.
విజయవాడలో ఘరానా మోసం వెలుగు చూసింది. కాల్ మనీ పేరుతో వేధింపులకు గురి చేస్తున్న 12 మందిని టాస్క్‌ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. కృష్ణా జిల్లా పంటకాలువ రోడ్డులోని ఓ భవనాన్ని కేంద్రంగా తీసుకుని ముఠా సభ్యులు ఈ బాగోతాన్ని నడుపుతున్నారు. ప్రతి రోజు నగరంలో కోట్ల రూపాయలతో కాల్ మనీ వ్యాపారం చేయడంతో పాటు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు దాడులు నిర్వహించారు. కాల్ మనీ సభ్యులు రోజువారీ వడ్డీగా 10 నుంచి 25 రూపాయల వరకు వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ముఠా అధిక వడ్డీ రేట్లకు అప్పులు ఇవ్వడమే కాకుండా బాధితులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తిచారు. అంతేకాదు బలవంతంగా మహిళలను వ్యభిచారంలోకి దింపుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. వేధింపులు ఎక్కువ కావడంతో కొందరు బాధితులు నగర పోలీసు కమిషనర్‌ కు ఫిర్యాదు చేశారు. దీంతో వ్యవహారం వెలుగు చూసింది.
కాల్ మనీ ముఠా రోజుకు కోట్లలో టర్నోవర్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మోసంలో నగరంలోని బడా వ్యాపారవేత్తల పాత్ర కూడా ఉన్నట్లు సమాచారం. కోట్ల రూపాయలు విలువ చేసే డ్యాక్యుమెంట్లను సీజ్ చేసిన టాస్క్‌ ఫోర్స్ పోలీసులు.. ముమ్మరంగా విచారణ జరుపుతున్నారు.