Sunday, November 27, 2011

విదేశి పెట్టుబడులు -భారత్ రిటైల్ మార్కెట్


'పాలకవర్గాలు తమ ప్రయోజనాలనే మొత్తం సమాజ ప్రయోజనాలుగాను , ఆదర్శవంతమైన రూపాలలో, విశ్వవ్యాప్త , హేతుభద్దమైన సిద్దంతాలుగాను, చెల్లుబాటు అయ్యే సిద్దంతలుగాను అమలు చేస్తాయని " కారల్ మార్క్స్ " హెచ్చరించాడు' ( 1845  ) 

ప్రస్తుతం మన అనుభవం కుడా ఇదే ఆర్ధిక వ్యవస్థ సరళీకరణ పేరుతొ విదేశి పెట్టుబడులు చిల్లర దుకాణాలలో కూడా ఆహ్వానించటం ఇది ఏ దేశ ప్రయోజనం కోసం , ఏ ప్రజల ప్రయోజనం కోసం. భారత దేశం వ్యవసాయ ఆదారిత మరియు గ్రామీణ నాగరికత మీద ఆదరిపడిన దేశం ఇలాంటి సమాజం లో లక్షల కుటుంబాలు చిల్లర దుకాణాల మీద ఆదారపడి జీవిస్తున్నాయి, అవే వారి జీవన ఆధారం . ఇప్పటికే పెద్ద పెద్ద నగరాలలో చైన్ మార్కెట్ పేరుతొ , మాల్స్ పేరుతొ మద్య తరగతి సూపర్ మార్కెట్ లను హరించి వేసాయి , రిటైల్ వ్యాపారస్తుల జీవితాలను రోడ్లు మీదకు తీసుకు వచ్చింది ఈ ప్రభుత్వాలు , మరల చిన్న చిన్న వ్యాపారాల లో కుడా పెట్టుబడుదారులు ప్రవేశిస్తే , భారత గ్రామీణ , నగరాల ఆర్దిక వ్యవస్థ విదేశి పెట్టుబడుదారుల మీద ఆదారపడి ఉంటుంది . అది ఎంత విద్వంసకరమో మనకు "ఈస్ట్ ఇండియా " కంపినీ తెలుసు , ప్రస్తుత స్టాక్ మార్కెట్ ల పరిస్తితి తెలుసు.


కేంద్రం లో కాని, రాష్ట్రము లో కాని ఏ భూర్జువ పార్టి అధికారం లో కి వచ్చిన సరళీకృత ఆర్ధిక విదానలే అమలు చేస్తున్నాయి వీటి పలితమే ఆశ్రిత పెట్టుబడి విదానం, అవినీతి, అధిక ధరలు తదితర సమస్యలన్నీ. దేశ ప్రయోజనాల ముసుగులో పాలక వర్గ సిద్దంతాలు, ప్రజల కనీస  అవసరాలను పెట్టుబడులుగా చేస్తూ , పెట్టుబడిదారుల అభివృద్దే మొత్తం దేశ ప్రజల అభివృద్దిగా చూపిస్తున్నారు. 
భారత దేశం లో అన్ని పార్టి లు , చివరకు కమ్యునిస్ట్ లు కూడా ఎన్నికల అనంతరం తమ విదానాన్ని మరచి ప్రభుత్వ ప్రజా వెతిరేక విదానాలను గుడ్డిగా మద్దతు ఇస్తున్నాయి. మన దేశం లో చిన్న తరహ , మద్య తరహా పారిశ్రామికరణ జరగకుండ ౩౦% విదేశి పెట్టుబడులను రిటైల్ రంగం లోకి ఆహ్వానించటం 'చైనా' లాంటి దేశాలకు ఉపయోగం తప్ప మన దేశనికి ఎలాంటి ప్రయోజనం లేదు. ప్రభుత్వం మన దేశ చిన్న ,మద్య తరహా వ్యాపారవేత్తల కాపాడటానికి బదులు , ప్రపంచం లోని మార్కెట్ లను కాపాడటానికే ఎక్కువ ఆసక్తిగా ఉన్నట్టుగా వుంది . ప్రభుత్వం చెప్పిన్నట్టు ఎన్ని తరహ ఆంక్షలు పెట్టిన మన గ్రామీణ ఆర్ధిక వ్యవస్థ కుప్పకూలటం ఖాయం. ఇప్పటికే అమెరికా 'చైనా' ఉత్పత్తులతో అతలాకుతలం అవుతుంది.